Showing posts with label Latest. Show all posts
Showing posts with label Latest. Show all posts

Tuesday, March 12, 2019

ఆడొద్దంటే వింటేనా: PubG గేమ్ ప్రాణం తీసింది

ఆడొద్దంటే వింటేనా: PubG గేమ్ ప్రాణం తీసింది

Degree Student, Suicide, Pubg game, Sai kiran, Gajwel PubG video game
పబ్ జీ గేమ్.. పబ్ జీ గేమ్.. పబ్ జీ గేమ్.. ఎక్కడ విన్నా ఈ వీడియో గేమ్ గురించే.. చైనాకు చెందిన సంస్థ రూపొందించిన ఈ వీడియో గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ పబ్ బీ మాయలో పడిపోయారు. గంటల కొద్ది పబ్ జీ గేమ్ తోనే గడిపేస్తుంటారు.  సరదా కోసం ఆడే ఈ పబ్ జీ గేమ్ కు యూత్ అంతా బానిస అవుతున్నారు.


స్కూల్ పిల్లల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు అందరూ పబ్ జీ మాయలో పడిపోయారు. పేరంట్స్, టీచర్లు, అధికారులు, ప్రభుత్వం ఎంతగా వద్దని చెప్పిన పబ్ జీ గేమ్ ను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పబ్ జీ గేమ్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన పబ్ జీ గేమ్ మొబైల్ వర్షన్ అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరూ ఆడేస్తున్నారు. పబ్ జీ మాయలో పడిన ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించిందని ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ కు చెందిన సాయి కిరణ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

పబ్ జీ గేమ్ కు బానిసైన కిరణ్ చదువును నిర్లక్ష్యం చేశాడు. తల్లి ఎంతగా చెప్పిన వినిపించుకోలేదు. పబ్ జీ గేమ్ ఆడొద్దని హెచ్చరించిన పట్టించుకోలేదు. పరీక్షల్లో మార్కుల శాతం తగ్గిపోయింది. ఓ రోజు తల్లి గట్టిగా కిరణ్ ను మందలించింది. అంతే.. మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Monday, March 11, 2019

డేంజర్ బ్రదర్స్:  బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తున్నారా?

డేంజర్ బ్రదర్స్: బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తున్నారా?

Are-you-filling-petrol-full-tank-in-your-bike
ప్రతిఒక్కరికి బైక్ కామన్ అయిపోయింది. బయటకు అడుగుపెడితే చాలు.. బైక్ తీయాల్సిందే. దగ్గరైనా.. దూరమైన బైక్ పై వెళ్లాల్సిందే. చాలామందికి ఇది అలవాటు ఉంటుంది. అవసరం ఉన్న లేకున్నా బైకును తెగ తిప్పితే పెట్రోల్ ఆవిరైపోదు మరి. వెంటనే పెట్రోల్ బంకుకు పరుగులు పెట్టేస్తుంటారు. అసలు సమస్య ఇక్కడే మొదలయ్యేది. కొంతమంది అయితే పెట్రోల్ అవసరం ఉన్నా లేకున్నా బైక్ లో ఫుల్ ట్యాంకు చేయిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ ట్యాంకు చేయించకపోవడమే  ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.


సీజన్ ఏదైనా ఫుల్ ట్యాంకు చేయించడానికి సాధ్యమైనంత వరకు అవైడ్ చేయడమే మంచిది. పదే పదే ఎవరూ బంకుల చుట్టూ తిరుగుతారులే అని ఎంతోమంది బైకుల్లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తుంటారు. ఈ అలవాటు వెంటనే మానుకోండి.. ముఖ్యంగా వేసవిలో అసలే ఈ పనిచేయొద్దు. సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. బైక్ లో ఫుల్ ట్యాంకు పెట్రోల్ చేయించడం వల్ల వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వాహనాలు పేలిపోయే అవకాశం ఉంది. అందుకే సగం వరకు మాత్రమే ట్యాంకులో పెట్రోల్ పోయించడం ఎంతో మంచిది.. లేదంటే ప్రమాదాల్లో పడతారు జర జాగ్రత్త.. బీ కేర్ ఫుల్ బ్రదర్స్..

ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. 
- బైక్ ట్యాంకులో పెట్రోల్ సగం వరకు మాత్రమే పోయించండి
- ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం బైక్ పై డ్రైవ్ చేయకండి
- ఇంజిన్ హీట్ అయి పెట్రోల్ మండే స్వభావం కారణంగా మంటలు అంటుకోవచ్చు
- దూర ప్రయాణం చేసే సమయంలో బైక్ మధ్యలో ఆపుతూ వెళ్లడమే ఉత్తమం
- పార్కింగ్ చేసే సమయంలో ఎండలో బైక్ నిలపొద్దు.. నీడలో పార్క్ చేయండి
- పెట్రోల్ పోయించే సమయంలో ఫోన్లలో మాట్లాడొద్దు.. ఫోన్ కాల్ వచ్చిన లిఫ్ట్ చేయొద్దు

Sunday, March 10, 2019

SAAHO : ప్రభాస్ సాహో మూవీ యాక్షన్ వీడియో వైరల్

SAAHO : ప్రభాస్ సాహో మూవీ యాక్షన్ వీడియో వైరల్

Saaho, Prabhas, Shraddha Kapoor, Bhushan Kumar, Action Shooting, Bahubali movie, SS Rajamouli, Prabhas new movie
రెబల్ స్టార్ నటిస్తున్న కొత్త చిత్రం.. సాహో.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీతో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ కు పాపులారిటీ వచ్చేసింది. తనదైన నటనతో అభిమానులతో సహా అందరిని ఆకట్టుకున్నాడు ఈ ధీర బాహుబలి.. రాజమౌళి సినిమా కోసం కమిట్ అయిన ప్రభాష్..


మరో సినిమా చేయలేదు.. బాహుబలి సినిమా రెండు పార్ట్ లు పూర్తయ్యాక.. ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం.. సాహో.. బాహుబలి తరహాలో సాహో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సాహో చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఛాప్టర్-2 దృశ్యాలు  ఫారెన్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సాహో చిత్రానికి సంబంధించి షూటింగ్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.



శామ్..చైతూ జంటగా: మజిలీ మూవీ టీజర్ చూశారా?

శామ్..చైతూ జంటగా: మజిలీ మూవీ టీజర్ చూశారా?

Majili, Majili movie teaser,Naga Chaitanya, Samantha, Divyansha, Kaushik, Gopi Sundar, Shiva Nirvana
సమంత, నాగచైతన్యల కొత్త సినిమా మజిలీ రాబోతుంది. సమంత లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమా ఏం మాయ చేసేవేతో మొదలైన స్నేహం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది.. కట్ చేస్తే.. అక్కేనేని కోడలిగా అడుగుపెట్టింది సమంత. పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే సమంత తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది.



అందం.. అమ్మాయి అయితే : సమంత లేటెస్ట్ ఫొటోస్

అందం.. అమ్మాయి అయితే : సమంత లేటెస్ట్ ఫొటోస్

అందం.. అమ్మాయి అయితే నీలా ఉందా.. అన్నట్టు ఉందే.. ఉండిపోరాదే.. ఓ... ఓ...  సమంత... 

సమంత.. అనగానే గుర్తుచ్చే సినిమా.. ఏమాయ చేశావే.. ఈ సినిమాతో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక కుర్రాళ్లను తన అందంతో మాయచేసింది.. అప్పటినుంచి వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పాపులర్ అయిపోయింది. అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమాలో ఏం మాయ చేసేవేతో మొదలైన వీరి.. స్నేహం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది.. కట్ చేస్తే.. అక్కినేని కోడలిగా అడుగుపెట్టింది సమంత.



పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే సమంత తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సమంత ఫుల్ యాక్టివ్.. ఫొటోలను కూడా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పోస్టు చేసి అందరితో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం సమంత, నాగచైతన్యల కొత్త సినిమా మజిలీ రాబోతుంది. సమంత లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  Samantha-Akkineni-Latest-Photos-Viral
Samantha-Akkineni-Latest-Photos-Viral
Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral