720 x 90

RRR మూవీ : NTR హీరోయిన్ దొరికిందోచ్!


టాలీవుడ్ టాప్ డైరెక్టర్, జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR మూవీకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ బయటికివచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ మూవీ 2020 జులై 30న విడుదల చేసేందుకు రాజమౌళి సన్నద్ధమవుతున్నారు.

RRR మూవీ ఆగిపోయిందని, ఇప్పట్లో పూర్తి కాదంటూ సోషల్ మీడియాలో రుమార్లు వస్తున్నాయి. వీటికి చిత్రబృందం చెక్ పెట్టేసింది. నవంబర్ 19 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కాగా..  భారీ సెట్ వేసి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇప్పటి వరకు 70 శాతం వరకు షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించారు కూడా. RRR మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి RRR movie యూనిట్ ట్వీట్ చేసింది.


RRR మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ అందాల నటి ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతోంది. తారక్ జోడీ ఎవరు అనేదానిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.

తారక్ హీరోయిన్‌ ఎవరో ఈరోజు (నవంబర్ 20న) చిత్ర యూనిట్ ప్రకటించనుంది. NTRకు సరసన హాలీవుడ్ నటి ఎమ్మా రోబర్ట్స్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ యూఎస్ భామ వైల్డ్ చైల్డ్, వీ ఆర్ ది మిల్లర్స్, నర్వ్ పలు హాలీవుడ్ మూవీల్లో నటించింది. ఎన్టీఆర్ జోడీగా ఈ భామనే కాదా? అనేదానిపై నేడు క్లారిటీ రానుంది.

విలన్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం వంటి పలు భాషల్లో RRRమూవీ తెరకెక్కుతోంది. DVV ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై DVV దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. ఎం.ఎం.కీరవాణి బాణీలను సమకూరుస్తోన్నారు. 




Post a Comment

0 Comments