720 x 90

మరీ ఇంత బోల్డా : బూతులు తిడుతూ రెచ్చిపోయిన మీనా


Actress-Meena-Hot-Daialouges-in-Karoline-Kamakshi-Web-Series-Official-Trailer

తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైనా సినీనటి మీనా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అడపాదడపా సినిమాల్లో చేస్తూనే తమ అభిమానులను మీనా అలరిస్తూ వస్తోంది. తెలుగులో వచ్చిన దృశ్యం మూవీతో మళ్లీ ప్రేక్షకులను మెప్పించింది. మూవీలతో అభిమానులకు దగ్గరైనా మీనా.. వెబ్ సిరీస్ ల్లోనూ నటించేందుకు ఓకే చెప్పేసింది.

ప్రస్తుతం ట్రెండ్‌కు తగినట్టుగా వెబ్ సిరీస్‌ల్లోనూ నటించాలనే ఆలోచన వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్ వరకూ వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. బడా నటులు వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నటి మీనా కూడా వెబ్ సిరీస్ లో నటించి అలరిస్తోంది. హాట్ హాట్ డైలాగ్ లుతో కనిపించింది. ఇటీవల తమిళ వెబ్ సిరీస్ లో వస్తున్న వెబ్ సిరీస్ లో మీనా నటించింది.


ఇందులో మీనా హాట్ డైలాగ్ లతో రెచ్చిపోయిట్టు కనిపిస్తోంది. 'కరోలిన్ కామాక్షి' అనే పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో మీనా బూతులు తిట్టిన సీన్ ట్రెండ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో గన్ పట్టుకుని యాక్షన్ సీన్స్ లో మీనా రెచ్చిపోయి నటించింది. మీనా మద్యం మత్తులో చెప్పే హాట్ డైలాగులు తెగ వైరల్ అవుతున్నాయి.


Post a Comment

0 Comments