720 x 90

షాకింగ్ వీడియో.. పిడుగు నుంచి కాపాడిన గొడుగు

Thunder, Umbrella, Man escaped death, Bolt lighting, Viral Video

పిడుగు.. పేరు వింటనే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. పిడుగు ధాటికి ఎలాంటి వృక్షమైనా సరే కాలి బూడిదె కావాల్సిందే. అంత పవర్ ఉంటుంది. కొన్ని వేల లక్షల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. మెరుపు మెరవగానే భారీ శబ్దంతో భూమిపైకి దూసుకొస్తుంది. సాధారణంగా ఎత్తైన చెట్లపైనా పిడుగు పడుతుంటుంది. పిడుగు నుంచి ఉత్పత్తి అయ్యే శక్తితో కొన్ని వేల సంవత్సరాల వరకు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చుని అంటారు.

అది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, పిడుగు ప్రభావానికి మాడి మసై పోవాల్సిందే. అలాంటి అత్యంత ప్రమాదకరమైన పిడుగు పడినా ఓ వ్యక్తి బతికే ఉన్నాడు. ఎలాంటి గాయాలు కూడా కాలేదు. నమ్మలేని ఈ అరుదైన దృశ్యం దక్షిణ కరోలినాలో జరిగింది. కాన్వేలో ఓ అకాడమీలో పనిచేసే కౌన్సెలర్ కు ఈ అనుభవం ఎదురైంది. నిజానికి పిడుగుపాటుకు చావాల్సిన వాడు బతికి బయటపడ్డాడు. ఒక రోజు భారీగా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి.. భారీ శబ్దంతో ఉరుములు ఉరుముతున్నాయి.


బయట కాలు పెడితే వణికిపోవాల్సిందే. అంత పెద్ద స్థాయిలో ఉరుముతోంది. ఏ క్షణమైన పిడుగు పడే అవకాశం ఉంది. పని మీద తన అకాడమీ నుంచి గార్డెన్ లోకి వెళ్లబోయాడు ఇతడు. కొద్దిదూరమే కదా ఏమౌతుందిలే అనుకున్నాడు. జోరు వానలోనూ గొడుగుతో గార్డెన్ మీదుగా వెళ్తున్నాడు. ఇంతలో భారీ శబ్దంతో ఉరుము ఉరిమింది. దడేల్ మంటూ అతడిపై పిడుగు పడింది. అదృష్టవశాత్తూ పిడుగు అతడి గొడుగును తాకింది. షాకైన అతడు తన గొడుగు మూసి లోపలికి పరిగెత్తాడు.

పిడుగు నుంచి గొడుగు అతన్ని కాపాడిందని చెప్పాలి. నిజానికి అతడు బతకడం అదృష్టమని చెప్పాలి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాన్ని చూస్తే నమ్మక తప్పదు. అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని తన ఫేస్ బుక్ పేజీ ద్వారా తెలిపాడు. వీడియోను పోస్టు చేశాడు. బ్రేక్ ఫాస్ట్ చేద్దామని ఇంటికి వెళ్తుండగా పిడుగు పడిందని.. ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించగానే గొడుగు కింద పడేసినట్టు చెప్పాడు. నిజంగా పునరజన్మేనంటూ ఆనందం వ్యక్తం చేశాడు. 

Post a Comment

0 Comments