720 x 90

పిల్లలా.. పిడుగులా.. గాల్లోకి ఎలా ఎగురుతున్నారో చూడండి

students feet jump

ఏం పిల్లలు బాబోయ్.. జిమ్నాస్టిక్ జంప్ ఎలా చేస్తున్నారో చూడండి. రోడ్డు మీద గాల్లోకి ఎగిరి దూకేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన స్కూల్ విద్యార్థులు. భుజాన బ్యాగులేసుకుని ఈజీగా మెలికలు తిరిగేస్తున్నారు.

స్కూల్ కు వెళ్లే సమయంలో రోడ్డు మీద ఇలా జిమ్నాస్టిక్ చేస్తూ కనిపించారు. చిన్ననాటి నుంచే స్టంట్ లపై ఆసక్తి ఉన్న ఈ విద్యార్థులు ఆసక్తికరమైన రీతిలో బంగీ జంప్ మాదిరిగా గెంతులెశారు. గాల్లోకి అమాంతం పైకి ఎగిరి సరిగా బ్యాలెన్స్ చేస్తూ ల్యాండ్ అయ్యారు.


చిచ్చుర పిడుగుల్లా విద్యార్థులు చేసే జంపింగ్ అందరిని అబ్బురపరిచేలా ఉంది. పిల్లలిద్దరూ రోడ్డుపైకి ఎగిరి గంతేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు... పిల్లలు కాదు... పిడుగులు అంటూ మెచ్చుకుంటున్నారు. గంతులు సరే.. జారితే ప్రమాదం జర జాగ్రత్త అంటున్నారు. 

Post a Comment

0 Comments