720 x 90

RRR మూవీపై రాజమౌళి సర్‌ప్రైజ్ : అల్లూరిగా రామ్ చరణ్ కొత్త లుక్ చూశారా?

RRR, Ram Charan Tej, Raja Mouli, Alluri Seetharama Raju, Ram Charan New Look,

బాహుబలి మూవీతో టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టిన టాప్ డైరెక్టర్ రాజమౌళి మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. తెలుగు టాప్ యుంగ్ హీరోలతో సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నమూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ ఆర్ఆర్ఆర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తు వస్తున్నారు. ఎప్పటికప్పుడూ RRR మూవీ కొత్త అప్ డేట్లను రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచుకుంటు పోతున్నారు.


రాజమౌళి సినిమా అనగానే గ్యారెంటీ హిట్ అనే టాక్ కామన్ అయిపోయింది. రాజమౌళి చేతిలో పడితే ఎంతటి హీరో అయినా పెద్ద స్టార్ అయిపోవాల్సిందే. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీకి సంబంధించి ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ మూవీలో రామ్ చరణ్ గెటప్ పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అల్లూరి పాత్రలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ ఫేస్ పూర్తిగా కనిపించకపోయినప్పటికీ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉంది. RRR మూవీ 2020 జూలై 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జక్కన్న చెప్పకనే చెప్పేశాడు. స్టార్ హీరోలు కాంబినేషన్ లో రాబోయే RRR మూవీ ప్రేక్షకుల ముందుకు రావాలంటే మరో ఏడాది వరకు ఆగాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్ కొత్త లుక్ పోస్టర్ ఇదే.. 

Post a Comment

0 Comments