720 x 90

ఒకవైపే స్తంభన : గన్ మిస్ ఫైర్.. గజ్జల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్..!


Man-penis-injured-after-Gun-miss-fire-in-pocket
గన్ మిస్ ఫైర్ అయింది.. గజ్జల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. చచ్చినంత పనైంది. చావు దప్పి కన్ను లొట్ట బోయి నట్టయింది. లేదంటే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యాన్నే చెల్లించు కున్నాడు. మనిషి శరీరంలో అతి సున్నితమైన అవయవాల్లో అంగం ఒకటి.. ఎంతో ముఖ్యమైన తన అంగం పూర్తి స్థాయిలో స్తంభించడం ఆగిపోయింది.

ఒకవైపు మాత్రమే స్తంభిస్తున్నట్టు వైద్యులు తేల్చేశారు. గన్ ఉంది కదా? అని ఎలా పడితే అలా పెట్టుకుంటే ఇదిగో ఈ పరిస్థితే ఎదురువుతుంది. గన్ సరిగా లోడ్ చేయకుండానే పాయింట్ జేబులో పెట్టుకోబోయాడు. అంతే.. ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ వేగంతో అతడి పురుషాంగం పైకొన మీదుగా తాకుతూ దూసుకెళ్లింది. తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.


బతికి బట్టకట్టాడులే అనుకుంటే.. అతడి అంగం సగ భాగం స్తంభించకుండా పోయిందని తెలిసి అతడిలో ఆందోళన ఎక్కువై పోయింది. ఒకవైపు మాత్రమే గట్టిపడుతుంది.. మరోవైపు మెత్తగా ఉంటుంది.. యూరాలజీ మెడికల్ టెస్టుల్లో ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితుడిపై అంగం పైభాగంలో సుతిమెత్తని ప్రాంతంలో ఒక వైపుగా బుల్లెట్ తాకింది. దీంతో అక్కడ బాగా చిధ్రమై రక్తం కారింది. అందుకే ఒకవైపు మాత్రమే అంగం స్తంభిస్తుందని బర్మింగ్హామ్‌ వైద్యులు చెబుతున్నారు. సర్జరీలు మీద సర్జరీలు చేసి వైద్యులు అతడ్ని రక్షించారు. 

Post a Comment

0 Comments