720 x 90

గుంటూరు నివాసికి షాక్.. కొరియర్‌‌లో 4 అడుగుల తాచుపాము

Courier-deliveres-snake-in-parcel-to-Guntur-man-in-Odisha

మీ ఇంటికి ఏదైనా కొరియర్ వచ్చిందా? కాస్త ఆగండి.. తొందరపడి ఓపెన్ చేయకండి. లేదంటే.. ప్రాణాలు పోతాయి జాగ్రత్త. అందులో పాము ఉండొచ్చు. అదేంటీ.. పార్సిల్ లో పాము ఏంటి అని షాక్ అయ్యారా? అవును. ఒడిషాలో ఓ వ్యక్తికి ఈ వింత అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన కొరియర్ పార్సిల్ ఓపెన్ చేయగానే బుస్ మంటూ 4 అడుగుల తాచుపాము లేచి కాటేయబోయింది. అదృష్టవశాత్తూ అప్రమత్తం కావడంతో ప్రాణపాయం తప్పింది. ఆ వ్యక్తి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నివాసి. అతడే గుంటూరుకు చెందిన ముత్తు కుమారన్. ఉద్యోగం నిమిత్తం ఒడిషాకు వెళ్లిన సమయంలో అతడికి ఈ షాకింగ్ ఘటన జరిగింది. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నవారు పామును పట్టుకున్నారు.

ఆగస్టు 9న ఓ ప్రైవేటు కొరియర్ కంపెనీ ముత్తు బుక్ చేసిన పార్సిల్ ను గుంటూరు నుంచి డిస్పాచ్ చేసింది. ఒడిషాలోని తన ఇంటికి డెలివరీ అయిన కంటైనర్ ఓపెన్ చేయగానే పాము కనిపించినట్టు ముత్తు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Post a Comment

0 Comments