వాట్సాప్ లో గ్రూపు ఇన్విటేషన్ ఫీచర్ వచ్చేసిందోచ్

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో ‘గ్రూపు ఇన్విటేషన్’ ఫీచర్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లో Beta వర్షన్ వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫుల్ వర్షన్ డెవలప్ కావాల్సి ఉంది. టెస్టింగ్ లో భాగంగా బీటా వర్షన్ వాట్సాప్ యూజర్లకు ‘గ్రూప్ ఇన్విటేషన్’ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ఫుల్ అప్‌డేట్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఇంతకీ, ఈ ఫీచర్ గురించి చెప్పలేదు కదా.. వాట్సాప్ లో గ్రూపులు ఉంటాయని అందరికి తెలిసిందే. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లు ఎంతమందైన ఉండొచ్చు..అలాగే అడ్మిన్లు ఎవరైనా మీ వాట్సాప్ నెంబర్ ను యాడ్ చేసే వీలుంది. అయితే ఇకపై అలా కుదరదు. మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేయాలంటే తప్పకుండా మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే..
WhatsApp-Group-invitation-feature-comes-to-beta-stable-build-expected-soon


అందుకు అడ్మిన్ కు గ్రూపు ఇన్విటేషన్ పంపాల్సి ఉంటుంది. మీరు ఓకే చేస్తేనే మీ నెంబర్ వాట్సాప్ గ్రూపులో యాడ్ అవుతుంది. ఇప్పటివరకూ మీ అనుమతి లేకుండానే మీ వాట్సాప్ నెంబర్ ను గ్రూపుల్లో యాడ్ చేసేవాళ్లు. మీకు గ్రూపులో ఉండటం ఇష్టం లేకపోయినా గ్రూపులో కొనసాగాల్సి వచ్చేది. పోను... గ్రూపులో నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే.. మీరు గ్రూపు నుంచి ఎగ్జిట్ అయిన మరుక్షణమే.. గ్రూపులో నుంచి మీరు ఎగ్జిట్ అయినట్టు సభ్యులందరికి తెలిసిపోతుంది.

అది చూసి చాలామంది కొంచెం గిల్టీగా ఫీలవుతుంటారు. ఈ గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ఉంటే.. మీకు ఆ బెంగ అక్కర్లేదు. గ్రూపులో చేరడానికి ముందే మీరు ఆ గ్రూపులో చేరాలా వద్దా? అని నిర్ణయించుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా.. వాట్సాప్ సెట్టింగ్స్ లో గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి..

- ఇక్కడ అకౌంట్ ఆప్షన్ పై సెలెక్ట్ చేసుకోవాలి.
- ప్రైవసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి..
- గ్రూప్స్ ఎంచుకోవాలి.
- Who can add me in groups అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎంచుకోవాలి.
- ఇందులో మూడు సెలెక్షన్స్ కనిపిస్తాయి.. ఎవరీవన్, మై కాంటాక్ట్స్, నో బడీ ( Everyone, My Contacts, No body).
 మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసుకోనేందుకు ప్రయత్నిస్తే.. మీ వాట్సాప్ నెంబర్ కు  ‘Group Invitation Request’మెసేజ్ వస్తుంది.  ఈ రిక్వెస్ట్ మెసేజ్ వచ్చిన 72 గంటల్లోగా Accept చేయాలి. లేదంటే గ్రూపు ఇన్విటేషన్ వెంటనే Expire అయిపోతుంది.

వాట్సాప్ లో గ్రూపు ఇన్విటేషన్ ఫీచర్ వచ్చేసిందోచ్  వాట్సాప్ లో గ్రూపు ఇన్విటేషన్ ఫీచర్ వచ్చేసిందోచ్ Reviewed by Tufan9 News on Saturday, March 09, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.