షాకయ్యారా? : చిన్నారి కడుపులో కిలో జుట్టు

చిన్నారి కడుపులో కిలో జుట్టు.. చదవగానే మీరు షాకయ్యారా? మీరే కాదు.. ఆపరేషన్ చేసిన డాక్టర్ల పరిస్థితి కూడా ఇదే. గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు చివరికి బాలిక కడుపులో నుంచి కిలో జట్టు బయటకు తీశారట. మెదక్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. తిరగని హాస్పటళ్లు లేవు. ఎక్కడికి వెళ్లినా కడుపు నొప్పి ఎందుకు వస్తుందో గుర్తించలేకపోయారు. ముందుగా.. చిన్నారి కడుపులో ఏదైన గడ్డ ఉందేమోనని అనుకున్నారు.కానీ, కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో బాలికను చేర్పించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి కడుపునొప్పికి కారణం.. గడ్డ కాదు.. వెంట్రుకల ఉండ ఉన్నట్టు వైద్యులు పరీక్షల్లో గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఆపరేషన్ చేసి.. బాలిక కడుపులోని వెంట్రుకల ఉండను బయటకు తీశారు. బాలిక మెంటల్ టెన్షన్ తో బాధపడుతోందని, ఈ క్రమంలో రోజూ జుట్టు తినడం వల్లే అది ఇలా కడుపులో ఉండలా తయారైందని వైద్యులు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలో డిశ్చార్జీ చేస్తామని చెప్పారు. 
షాకయ్యారా? : చిన్నారి కడుపులో కిలో జుట్టు షాకయ్యారా? : చిన్నారి కడుపులో కిలో జుట్టు  Reviewed by Tufan9 News on Sunday, March 10, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.