ఆడొద్దంటే వింటేనా: PubG వీడియో గేమ్ ప్రాణం తీసింది

Degree Student, Suicide, Pubg game, Sai kiran, Gajwel PubG video game
పబ్ జీ గేమ్.. పబ్ జీ గేమ్.. పబ్ జీ గేమ్.. ఎక్కడ విన్నా ఈ వీడియో గేమ్ గురించే.. చైనాకు చెందిన సంస్థ రూపొందించిన ఈ వీడియో గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ పబ్ బీ మాయలో పడిపోయారు. గంటల కొద్ది పబ్ జీ గేమ్ తోనే గడిపేస్తుంటారు.  సరదా కోసం ఆడే ఈ పబ్ జీ గేమ్ కు యూత్ అంతా బానిస అవుతున్నారు.


స్కూల్ పిల్లల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు అందరూ పబ్ జీ మాయలో పడిపోయారు. పేరంట్స్, టీచర్లు, అధికారులు, ప్రభుత్వం ఎంతగా వద్దని చెప్పిన పబ్ జీ గేమ్ ను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పబ్ జీ గేమ్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన పబ్ జీ గేమ్ మొబైల్ వర్షన్ అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరూ ఆడేస్తున్నారు. పబ్ జీ మాయలో పడిన ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించిందని ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ కు చెందిన సాయి కిరణ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

పబ్ జీ గేమ్ కు బానిసైన కిరణ్ చదువును నిర్లక్ష్యం చేశాడు. తల్లి ఎంతగా చెప్పిన వినిపించుకోలేదు. పబ్ జీ గేమ్ ఆడొద్దని హెచ్చరించిన పట్టించుకోలేదు. పరీక్షల్లో మార్కుల శాతం తగ్గిపోయింది. ఓ రోజు తల్లి గట్టిగా కిరణ్ ను మందలించింది. అంతే.. మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 
ఆడొద్దంటే వింటేనా: PubG వీడియో గేమ్ ప్రాణం తీసింది ఆడొద్దంటే వింటేనా: PubG వీడియో గేమ్ ప్రాణం తీసింది Reviewed by Tufan9 News on Tuesday, March 12, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.