డేంజర్ బ్రదర్స్: బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తున్నారా?

Are-you-filling-petrol-full-tank-in-your-bike
ప్రతిఒక్కరికి బైక్ కామన్ అయిపోయింది. బయటకు అడుగుపెడితే చాలు.. బైక్ తీయాల్సిందే. దగ్గరైనా.. దూరమైన బైక్ పై వెళ్లాల్సిందే. చాలామందికి ఇది అలవాటు ఉంటుంది. అవసరం ఉన్న లేకున్నా బైకును తెగ తిప్పితే పెట్రోల్ ఆవిరైపోదు మరి. వెంటనే పెట్రోల్ బంకుకు పరుగులు పెట్టేస్తుంటారు. అసలు సమస్య ఇక్కడే మొదలయ్యేది. కొంతమంది అయితే పెట్రోల్ అవసరం ఉన్నా లేకున్నా బైక్ లో ఫుల్ ట్యాంకు చేయిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ ట్యాంకు చేయించకపోవడమే  ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.సీజన్ ఏదైనా ఫుల్ ట్యాంకు చేయించడానికి సాధ్యమైనంత వరకు అవైడ్ చేయడమే మంచిది. పదే పదే ఎవరూ బంకుల చుట్టూ తిరుగుతారులే అని ఎంతోమంది బైకుల్లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తుంటారు. ఈ అలవాటు వెంటనే మానుకోండి.. ముఖ్యంగా వేసవిలో అసలే ఈ పనిచేయొద్దు.

సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. బైక్ లో ఫుల్ ట్యాంకు పెట్రోల్ చేయించడం వల్ల వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వాహనాలు పేలిపోయే అవకాశం ఉంది. అందుకే సగం వరకు మాత్రమే ట్యాంకులో పెట్రోల్ పోయించడం ఎంతో మంచిది.. లేదంటే ప్రమాదాల్లో పడతారు జర జాగ్రత్త.. బీ కేర్ ఫుల్ బ్రదర్స్..

ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. 
- బైక్ ట్యాంకులో పెట్రోల్ సగం వరకు మాత్రమే పోయించండి
- ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం బైక్ పై డ్రైవ్ చేయకండి
- ఇంజిన్ హీట్ అయి పెట్రోల్ మండే స్వభావం కారణంగా మంటలు అంటుకోవచ్చు
- దూర ప్రయాణం చేసే సమయంలో బైక్ మధ్యలో ఆపుతూ వెళ్లడమే ఉత్తమం
- పార్కింగ్ చేసే సమయంలో ఎండలో బైక్ నిలపొద్దు.. నీడలో పార్క్ చేయండి
- పెట్రోల్ పోయించే సమయంలో ఫోన్లలో మాట్లాడొద్దు.. ఫోన్ కాల్ వచ్చిన లిఫ్ట్ చేయొద్దు
డేంజర్ బ్రదర్స్: బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తున్నారా? డేంజర్ బ్రదర్స్:  బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తున్నారా? Reviewed by Tufan9 News on Monday, March 11, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.