Google Trends : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం వెతికిన పాకిస్థానీలు

Pakistanis-searched-more-times-about-Indian-Air-Force
పాకిస్థాన్ భూభాగంలోని బాల్ కోట్ లో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానికి దళం బాంబుల వర్షం కురిపించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) మెరాజ్ యుద్ధ విమానాలతో విరుచుకపడింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ కూడా ప్రతిదాడికి దిగి తోకముడిచింది. ఎఫ్16 యుద్ధ విమానాలతో మిరాజ్ విమానాలపై ఎదురుదాడికి యత్నించి పాక్ విఫలయత్నం చేసింది. ఐఎఎఫ్ యుద్ధ విమానాల సామర్థ్యం ముందు పాక్ నిలబడలేకపోయింది. సర్జికల్ స్ట్రయిక్స్ 2 పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.


మరోవైపు పాకిస్థానీలు ఇండియా ఎయిర్ స్ట్రయిక్స్ (ఫిబ్రవరి 26, 2019)పై ఆసక్తి చూపారట. ఇదిలా ఉంటే, భారత వైమానిక దళాలను పాక్ తిప్పికొట్టామని చెప్పడం.. లేదు.. లేదు.. ఐఎఎఫ్ బలగాలను ఎదుర్కొలేక పాక్ బలగాలు తోకముడిచాయని వార్తలు రావడంతో ఈ గూగుల్ సెర్చ్ ట్రెండ్ మొదలైంది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళంపైనే ఎక్కువగా గూగుల్ సెర్చ్ లో వెతికారు. అందులో రెండు పదాలు గూగుల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రెండోవది పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్థాన్ కంటే.. ఇండియా ఎయిర్ ఫోర్స్ పదాల గ్రాఫ్ గూగుల్ సెర్చ్ లో ట్రెండ్ అయినట్టు ఎనాలిసిస్ తెలిపింది. ఈ రెండు పదాలతో పాటు మొత్తం ఐదు పదాలు గ్రాఫ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్, బాల్ కోట్, సర్జికల్ స్ర్టయిక్, ఎల్ఓసీ పదాలు ఒక్కరోజులోనే గూగుల్ సెర్చ్ ఫుల్ పాపులర్ అయ్యాయి. పాకిస్థానీల్లో ఎక్కువ మంది బాల్ కోట్ పైనే గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేశారు.

Tags:  Pakistanis, airstrikes, Balakot, google search, indian air force, pakistan air force

Google Trends : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం వెతికిన పాకిస్థానీలు Google Trends : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం వెతికిన పాకిస్థానీలు Reviewed by Tufan9 News on Wednesday, February 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.