Thursday, September 13, 2018

బిగ్‌బాస్-2 షో గణేశుడు భళా..!

దేశవ్యాప్తంగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్2’ త్వరలో ముగియనుంది. నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌గా వ్యహరిస్తున్న ఈ షోకు తిరుగులేని పాపులారిటీ వచ్చేసింది. ఇప్పటికే 95 రోజుల వరకు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్-2షోలో పోటాపోటీగా గేమ్ ఆడుతున్న బిగ్‌బాస్ ఏడుగురు ఇంటి సభ్యుల్లో ఎవరూ ఫైనల్ వరకు వెళ్తారో.. బిగ్‌బాస్-2 సీజన్ టైటిల్ ఎవరూ గెలుస్తున్నారో అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది.
సోషల్ మీడియా వేదికగా ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’ విన్నర్ ఎవర్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ‘బిగ్‌బాగ్‌ గణేషుడు’ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చొన్న వినాయకుడి విగ్రహాం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘బిగ్‌బాస్‌’ థీమ్‌తో కూడిన గణేశుడి సెట్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా కౌశల్‌ ఆర్మీ పేరుతో ఓ వినాయక మండపాన్నే ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్-2 సీజన్ విన్నర్‌గా కౌశల్‌ టైటిల్ అవార్డు పట్టుకున్నట్టు సెట్‌పై కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఫొటోలు ఇవే..

Tags: Bigboss-2 Season Set, Bigboss-2 Lord Ganesha Photo Viral, Bigboss-2 Season set, Nani Hosting Season Bigboss-2 Telugu TV Reality Show

SHARE THIS

Author:

0 comments: