Saturday, August 25, 2018

జగపతిబాబు ‘బయోపిక్’ వచ్చేస్తోంది..!

Jagapatibabu making biopic tv series
ప్రస్తుతం టాలీవుడ్ సినీపరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ప్రముఖుల జీవితాల ఆధారంగా ఇప్పటికే  ఎన్నో సినిమాలొచ్చాయి. తాజాగా ప్రముఖ సినీనటుడు జగపతిబాబు బయోపిక్ వచ్చేస్తుందట.. జగ్గుభాయ్ తన కెరీర్‌ ప్రారంభంలో హీరోగా రాణించి అనంతరం విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టేస్తున్నారు. బాలకృష్ణ ‘లెజెండ్‌’ చిత్రంతో విలన్‌గా ఆయన చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
తాజాగా బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు జగపతిబాబు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇది సినిమా తరహాలో ఉండదని, 20 ఎపిసోడ్స్‌తో ఒక సీరియల్‌‌గా టెలివిజన్‌లో ప్రసారం కాబోతుందని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. షూటింగ్‌ ప్రారంభమైందని, దీనికి ‘సముద్రం’ అనే టైటిల్‌ కూడా పెట్టినట్లు సమాచారం. ఈ బయోపిక్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

SHARE THIS

Author:

0 comments: