Tuesday, March 12, 2019

ఆడొద్దంటే వింటేనా: PubG గేమ్ ప్రాణం తీసింది

ఆడొద్దంటే వింటేనా: PubG గేమ్ ప్రాణం తీసింది

Degree Student, Suicide, Pubg game, Sai kiran, Gajwel PubG video game
పబ్ జీ గేమ్.. పబ్ జీ గేమ్.. పబ్ జీ గేమ్.. ఎక్కడ విన్నా ఈ వీడియో గేమ్ గురించే.. చైనాకు చెందిన సంస్థ రూపొందించిన ఈ వీడియో గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ పబ్ బీ మాయలో పడిపోయారు. గంటల కొద్ది పబ్ జీ గేమ్ తోనే గడిపేస్తుంటారు.  సరదా కోసం ఆడే ఈ పబ్ జీ గేమ్ కు యూత్ అంతా బానిస అవుతున్నారు.


స్కూల్ పిల్లల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు అందరూ పబ్ జీ మాయలో పడిపోయారు. పేరంట్స్, టీచర్లు, అధికారులు, ప్రభుత్వం ఎంతగా వద్దని చెప్పిన పబ్ జీ గేమ్ ను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పబ్ జీ గేమ్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన పబ్ జీ గేమ్ మొబైల్ వర్షన్ అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరూ ఆడేస్తున్నారు. పబ్ జీ మాయలో పడిన ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించిందని ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ కు చెందిన సాయి కిరణ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

పబ్ జీ గేమ్ కు బానిసైన కిరణ్ చదువును నిర్లక్ష్యం చేశాడు. తల్లి ఎంతగా చెప్పిన వినిపించుకోలేదు. పబ్ జీ గేమ్ ఆడొద్దని హెచ్చరించిన పట్టించుకోలేదు. పరీక్షల్లో మార్కుల శాతం తగ్గిపోయింది. ఓ రోజు తల్లి గట్టిగా కిరణ్ ను మందలించింది. అంతే.. మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Monday, March 11, 2019

డేంజర్ బ్రదర్స్:  బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తున్నారా?

డేంజర్ బ్రదర్స్: బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తున్నారా?

Are-you-filling-petrol-full-tank-in-your-bike
ప్రతిఒక్కరికి బైక్ కామన్ అయిపోయింది. బయటకు అడుగుపెడితే చాలు.. బైక్ తీయాల్సిందే. దగ్గరైనా.. దూరమైన బైక్ పై వెళ్లాల్సిందే. చాలామందికి ఇది అలవాటు ఉంటుంది. అవసరం ఉన్న లేకున్నా బైకును తెగ తిప్పితే పెట్రోల్ ఆవిరైపోదు మరి. వెంటనే పెట్రోల్ బంకుకు పరుగులు పెట్టేస్తుంటారు. అసలు సమస్య ఇక్కడే మొదలయ్యేది. కొంతమంది అయితే పెట్రోల్ అవసరం ఉన్నా లేకున్నా బైక్ లో ఫుల్ ట్యాంకు చేయిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ ట్యాంకు చేయించకపోవడమే  ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.


సీజన్ ఏదైనా ఫుల్ ట్యాంకు చేయించడానికి సాధ్యమైనంత వరకు అవైడ్ చేయడమే మంచిది. పదే పదే ఎవరూ బంకుల చుట్టూ తిరుగుతారులే అని ఎంతోమంది బైకుల్లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయిస్తుంటారు. ఈ అలవాటు వెంటనే మానుకోండి.. ముఖ్యంగా వేసవిలో అసలే ఈ పనిచేయొద్దు. సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. బైక్ లో ఫుల్ ట్యాంకు పెట్రోల్ చేయించడం వల్ల వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వాహనాలు పేలిపోయే అవకాశం ఉంది. అందుకే సగం వరకు మాత్రమే ట్యాంకులో పెట్రోల్ పోయించడం ఎంతో మంచిది.. లేదంటే ప్రమాదాల్లో పడతారు జర జాగ్రత్త.. బీ కేర్ ఫుల్ బ్రదర్స్..

ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. 
- బైక్ ట్యాంకులో పెట్రోల్ సగం వరకు మాత్రమే పోయించండి
- ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం బైక్ పై డ్రైవ్ చేయకండి
- ఇంజిన్ హీట్ అయి పెట్రోల్ మండే స్వభావం కారణంగా మంటలు అంటుకోవచ్చు
- దూర ప్రయాణం చేసే సమయంలో బైక్ మధ్యలో ఆపుతూ వెళ్లడమే ఉత్తమం
- పార్కింగ్ చేసే సమయంలో ఎండలో బైక్ నిలపొద్దు.. నీడలో పార్క్ చేయండి
- పెట్రోల్ పోయించే సమయంలో ఫోన్లలో మాట్లాడొద్దు.. ఫోన్ కాల్ వచ్చిన లిఫ్ట్ చేయొద్దు

Sunday, March 10, 2019

ట్రెండింగ్ : నాని జెర్సీ మూవీ టీజర్ చూశారా?

ట్రెండింగ్ : నాని జెర్సీ మూవీ టీజర్ చూశారా?

Teaser-Nani-Jersey-Official-Teaser-Viral
పక్కంటి అబ్బాయిలా ఉండే న్యాచురల్ స్టార్ నాని.. మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-2 సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించి అందరిని అలరించిన నాని.. జెర్సీ మూవీలో నటిస్తున్నాడు. జెర్సీ మూవీకి సంబంధించిన పోస్టర్లను నాని తన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశాడు.


జెర్సీ సినిమా అఫిషయల్ టీజర్ ను కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జెర్సీ చిత్రంలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. జెర్సీ చిత్రానికి సంబంధించిన టీజర్ మీకోసం..

SAAHO : ప్రభాస్ సాహో మూవీ యాక్షన్ వీడియో వైరల్

SAAHO : ప్రభాస్ సాహో మూవీ యాక్షన్ వీడియో వైరల్

Saaho, Prabhas, Shraddha Kapoor, Bhushan Kumar, Action Shooting, Bahubali movie, SS Rajamouli, Prabhas new movie
రెబల్ స్టార్ నటిస్తున్న కొత్త చిత్రం.. సాహో.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీతో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రభాస్ కు పాపులారిటీ వచ్చేసింది. తనదైన నటనతో అభిమానులతో సహా అందరిని ఆకట్టుకున్నాడు ఈ ధీర బాహుబలి.. రాజమౌళి సినిమా కోసం కమిట్ అయిన ప్రభాష్..


మరో సినిమా చేయలేదు.. బాహుబలి సినిమా రెండు పార్ట్ లు పూర్తయ్యాక.. ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం.. సాహో.. బాహుబలి తరహాలో సాహో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సాహో చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఛాప్టర్-2 దృశ్యాలు  ఫారెన్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సాహో చిత్రానికి సంబంధించి షూటింగ్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.శామ్..చైతూ జంటగా: మజిలీ మూవీ టీజర్ చూశారా?

శామ్..చైతూ జంటగా: మజిలీ మూవీ టీజర్ చూశారా?

Majili, Majili movie teaser,Naga Chaitanya, Samantha, Divyansha, Kaushik, Gopi Sundar, Shiva Nirvana
సమంత, నాగచైతన్యల కొత్త సినిమా మజిలీ రాబోతుంది. సమంత లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమా ఏం మాయ చేసేవేతో మొదలైన స్నేహం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది.. కట్ చేస్తే.. అక్కేనేని కోడలిగా అడుగుపెట్టింది సమంత. పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే సమంత తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది.అందం.. అమ్మాయి అయితే : సమంత లేటెస్ట్ ఫొటోస్

అందం.. అమ్మాయి అయితే : సమంత లేటెస్ట్ ఫొటోస్

అందం.. అమ్మాయి అయితే నీలా ఉందా.. అన్నట్టు ఉందే.. ఉండిపోరాదే.. ఓ... ఓ...  సమంత... 

సమంత.. అనగానే గుర్తుచ్చే సినిమా.. ఏమాయ చేశావే.. ఈ సినిమాతో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక కుర్రాళ్లను తన అందంతో మాయచేసింది.. అప్పటినుంచి వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పాపులర్ అయిపోయింది. అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమాలో ఏం మాయ చేసేవేతో మొదలైన వీరి.. స్నేహం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది.. కట్ చేస్తే.. అక్కినేని కోడలిగా అడుగుపెట్టింది సమంత.పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే సమంత తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సమంత ఫుల్ యాక్టివ్.. ఫొటోలను కూడా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పోస్టు చేసి అందరితో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం సమంత, నాగచైతన్యల కొత్త సినిమా మజిలీ రాబోతుంది. సమంత లేటెస్ట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  Samantha-Akkineni-Latest-Photos-Viral
Samantha-Akkineni-Latest-Photos-Viral
Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral

Samantha-Akkineni-Latest-Photos-Viral


షాకయ్యారా? : చిన్నారి కడుపులో కిలో జుట్టు

షాకయ్యారా? : చిన్నారి కడుపులో కిలో జుట్టు

చిన్నారి కడుపులో కిలో జుట్టు.. చదవగానే మీరు షాకయ్యారా? మీరే కాదు.. ఆపరేషన్ చేసిన డాక్టర్ల పరిస్థితి కూడా ఇదే. గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు చివరికి బాలిక కడుపులో నుంచి కిలో జట్టు బయటకు తీశారట. మెదక్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. తిరగని హాస్పటళ్లు లేవు. ఎక్కడికి వెళ్లినా కడుపు నొప్పి ఎందుకు వస్తుందో గుర్తించలేకపోయారు. ముందుగా.. చిన్నారి కడుపులో ఏదైన గడ్డ ఉందేమోనని అనుకున్నారు.కానీ, కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో బాలికను చేర్పించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి కడుపునొప్పికి కారణం.. గడ్డ కాదు.. వెంట్రుకల ఉండ ఉన్నట్టు వైద్యులు పరీక్షల్లో గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఆపరేషన్ చేసి.. బాలిక కడుపులోని వెంట్రుకల ఉండను బయటకు తీశారు. బాలిక మెంటల్ టెన్షన్ తో బాధపడుతోందని, ఈ క్రమంలో రోజూ జుట్టు తినడం వల్లే అది ఇలా కడుపులో ఉండలా తయారైందని వైద్యులు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలో డిశ్చార్జీ చేస్తామని చెప్పారు. 

Saturday, March 09, 2019

 వాట్సాప్ లో గ్రూపు ఇన్విటేషన్ ఫీచర్ వచ్చేసిందోచ్

వాట్సాప్ లో గ్రూపు ఇన్విటేషన్ ఫీచర్ వచ్చేసిందోచ్

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో ‘గ్రూపు ఇన్విటేషన్’ ఫీచర్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లో Beta వర్షన్ వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫుల్ వర్షన్ డెవలప్ కావాల్సి ఉంది. టెస్టింగ్ లో భాగంగా బీటా వర్షన్ వాట్సాప్ యూజర్లకు ‘గ్రూప్ ఇన్విటేషన్’ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ఫుల్ అప్‌డేట్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఇంతకీ, ఈ ఫీచర్ గురించి చెప్పలేదు కదా.. వాట్సాప్ లో గ్రూపులు ఉంటాయని అందరికి తెలిసిందే. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లు ఎంతమందైన ఉండొచ్చు..అలాగే అడ్మిన్లు ఎవరైనా మీ వాట్సాప్ నెంబర్ ను యాడ్ చేసే వీలుంది. అయితే ఇకపై అలా కుదరదు. మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేయాలంటే తప్పకుండా మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే..
WhatsApp-Group-invitation-feature-comes-to-beta-stable-build-expected-soon


అందుకు అడ్మిన్ కు గ్రూపు ఇన్విటేషన్ పంపాల్సి ఉంటుంది. మీరు ఓకే చేస్తేనే మీ నెంబర్ వాట్సాప్ గ్రూపులో యాడ్ అవుతుంది. ఇప్పటివరకూ మీ అనుమతి లేకుండానే మీ వాట్సాప్ నెంబర్ ను గ్రూపుల్లో యాడ్ చేసేవాళ్లు. మీకు గ్రూపులో ఉండటం ఇష్టం లేకపోయినా గ్రూపులో కొనసాగాల్సి వచ్చేది. పోను... గ్రూపులో నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే.. మీరు గ్రూపు నుంచి ఎగ్జిట్ అయిన మరుక్షణమే.. గ్రూపులో నుంచి మీరు ఎగ్జిట్ అయినట్టు సభ్యులందరికి తెలిసిపోతుంది.

అది చూసి చాలామంది కొంచెం గిల్టీగా ఫీలవుతుంటారు. ఈ గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ఉంటే.. మీకు ఆ బెంగ అక్కర్లేదు. గ్రూపులో చేరడానికి ముందే మీరు ఆ గ్రూపులో చేరాలా వద్దా? అని నిర్ణయించుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా.. వాట్సాప్ సెట్టింగ్స్ లో గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి..

- ఇక్కడ అకౌంట్ ఆప్షన్ పై సెలెక్ట్ చేసుకోవాలి.
- ప్రైవసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి..
- గ్రూప్స్ ఎంచుకోవాలి.
- Who can add me in groups అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎంచుకోవాలి.
- ఇందులో మూడు సెలెక్షన్స్ కనిపిస్తాయి.. ఎవరీవన్, మై కాంటాక్ట్స్, నో బడీ ( Everyone, My Contacts, No body).
 మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసుకోనేందుకు ప్రయత్నిస్తే.. మీ వాట్సాప్ నెంబర్ కు  ‘Group Invitation Request’మెసేజ్ వస్తుంది.  ఈ రిక్వెస్ట్ మెసేజ్ వచ్చిన 72 గంటల్లోగా Accept చేయాలి. లేదంటే గ్రూపు ఇన్విటేషన్ వెంటనే Expire అయిపోతుంది.

Wednesday, February 27, 2019

Google Trends : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం వెతికిన పాకిస్థానీలు

Google Trends : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం వెతికిన పాకిస్థానీలు

Pakistanis-searched-more-times-about-Indian-Air-Force
పాకిస్థాన్ భూభాగంలోని బాల్ కోట్ లో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానికి దళం బాంబుల వర్షం కురిపించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) మెరాజ్ యుద్ధ విమానాలతో విరుచుకపడింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ కూడా ప్రతిదాడికి దిగి తోకముడిచింది. ఎఫ్16 యుద్ధ విమానాలతో మిరాజ్ విమానాలపై ఎదురుదాడికి యత్నించి పాక్ విఫలయత్నం చేసింది. ఐఎఎఫ్ యుద్ధ విమానాల సామర్థ్యం ముందు పాక్ నిలబడలేకపోయింది. సర్జికల్ స్ట్రయిక్స్ 2 పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.


మరోవైపు పాకిస్థానీలు ఇండియా ఎయిర్ స్ట్రయిక్స్ (ఫిబ్రవరి 26, 2019)పై ఆసక్తి చూపారట. ఇదిలా ఉంటే, భారత వైమానిక దళాలను పాక్ తిప్పికొట్టామని చెప్పడం.. లేదు.. లేదు.. ఐఎఎఫ్ బలగాలను ఎదుర్కొలేక పాక్ బలగాలు తోకముడిచాయని వార్తలు రావడంతో ఈ గూగుల్ సెర్చ్ ట్రెండ్ మొదలైంది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళంపైనే ఎక్కువగా గూగుల్ సెర్చ్ లో వెతికారు. అందులో రెండు పదాలు గూగుల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రెండోవది పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్థాన్ కంటే.. ఇండియా ఎయిర్ ఫోర్స్ పదాల గ్రాఫ్ గూగుల్ సెర్చ్ లో ట్రెండ్ అయినట్టు ఎనాలిసిస్ తెలిపింది. ఈ రెండు పదాలతో పాటు మొత్తం ఐదు పదాలు గ్రాఫ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్, బాల్ కోట్, సర్జికల్ స్ర్టయిక్, ఎల్ఓసీ పదాలు ఒక్కరోజులోనే గూగుల్ సెర్చ్ ఫుల్ పాపులర్ అయ్యాయి. పాకిస్థానీల్లో ఎక్కువ మంది బాల్ కోట్ పైనే గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేశారు.

Tags:  Pakistanis, airstrikes, Balakot, google search, indian air force, pakistan air force